Hyderabad: తలసాని కుటుంబంలో ఆనందోత్సాహాలు!

  • తండ్రి అయిన సాయికిరణ్  
  • ‘తాతయ్య’ అయిన తలసాని
  • అభినందనలు తెలిపిన నేతలు
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ‘తాతయ్య’ అయ్యారు. శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ తండ్రి అయ్యాడు. పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో, తలసాని కుటుంబంలో ఆనందోత్సాహాలు నిండాయి. ఈ సందర్భంగా సాయికిరణ్ కు ఆయన బంధువులు, మిత్రులు, నేతలు అభినందనలు తెలిపారు. కాగా, సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సాయికిరణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరపున కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు.
Hyderabad
TRS
Talasani
sai kiran

More Telugu News