Guntur District: వైసీపీ నేత మోదుగుల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు!

  • మోదుగుల బంధువుల ఇళ్లలో కూడా
  • ఎన్నికల ఏజెంట్, న్యాయ సలహాదారు నివాసాల్లోనూ
  • మోదుగులను ప్రశ్నిస్తున్న ఐటీ అధికారులు
గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సిబ్బంది సోదాలు నిర్వహించారు. గుంటూరులోని పట్టాభిపురంలో ఉన్న మోదుగుల నివాసంతో పాటు, బృందావన్ గార్డెన్స్ లోని ఆయన కార్యాలయంలో కూడా సోదాలు జరిగినట్టు సమాచారం. మోదుగుల బంధువులు, న్యాయ సలహాదారు కార్యాలయంలో, ఆయన ఎన్నికల ఏజెంట్ ఇంట్లోనూ ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. మోదుగులను ఇంటికి పిలిపించి ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
Guntur District
Mp
modugula
It
raids

More Telugu News