El;ections: ఈవీఎంలపై విశ్వాసం కల్పించే విషయంలో ఎన్నికల కమిషన్ తప్పు చేస్తోంది: ప్రొఫెసర్ నాగేశ్వర్

  • ట్యాంపరింగ్ ప్రూఫ్ అని ఈసీ అంటోంది
  • ప్రజలు దీనిపై ఆలోచించాల్సిన అవసరమే లేదంటోంది
  • ‘అది ఎలా కరెక్టు అవుతుంది?

ఈవీఎంలపై విశ్వాసం కల్పించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని, ఆ విషయంలోనే ఎన్నికల కమిషన్ తప్పు చేస్తోందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ టెక్నాలజీ ట్యాంపరింగ్ ప్రూఫ్, దీనిపై ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదని ఎన్నికల కమిషన్ ప్రజలకు చెబుతోందని అన్నారు. ‘అది ఎలా కరెక్టు అవుతుంది? ఏ టెక్నాలజీకి ట్యాంపరింగ్ ప్రూఫ్ ఉంటుంది?’ అని ప్రశ్నించారు. ప్రస్తుతం ట్యాంపరింగ్ జరుగుతోందా లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలుండొచ్చని, తన అంచనా ప్రకారం ఈవీఎంల ట్యాంపరింగ్ జరగడం లేదనే అని అన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురవుతున్నాయంటూ వస్తున్న ఆరోపణల స్థాయికి తగ్గట్టుగా ప్రజల్లో విశ్వాసం కల్పించాలంటే వీవీ ప్యాట్ మిషన్లలో ఓట్లను కూడా లెక్కించాలని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News