aadi saikumar: 'బుర్రకథ' నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్

  • ఆది సాయికుమార్ హీరోగా 'బుర్రకథ'
  • దర్శకుడిగా డైమండ్ రత్నబాబు
  • నైరా షాకి ఇది తొలి సినిమా      
తెలుగు తెరపై యువ కథానాయకులతో పోటీ పడటానికి ఆది సాయికుమార్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. కొంతకాలంగా సక్సెస్ అనేది పలకరించకపోవడంతో, ఆ సమయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా 'బుర్రకథ' రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆది సాయికుమార్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.

సినీ రచయితగా మంచి పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు .. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ జోడీగా మిస్తీ చక్రవర్తి నటిస్తోంది. తెలుగులో 'చిన్నదాన నీ కోసం' చిత్రం ద్వారా యూత్ కి ఆమె బాగా చేరువైంది. ఆ తరువాత ఆమె వరుస అవకాశాలను అందుకోలేకపోయింది. 'బుర్రకథ' తో టాలీవుడ్లో తాను బిజీ అవుతానని ఆమె భావిస్తోంది. ఇక మరో కథానాయికగా నైరా షా నటిస్తోంది .. తెలుగులో ఆమెకి ఇదే ఫస్టు సినిమా
aadi saikumar
mishti chakraborty

More Telugu News