sensex: లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముందు రోజు.. కుప్పకూలిన మార్కెట్లు

  • భారత వృద్ధి రేటు మందగిస్తుందని ఐఎంఎఫ్ అంచనా
  • 353 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 87 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కు ముందురోజైన ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈ ఏడాది భారత వృద్ధి రేటు మందగిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించిన అంచనాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 353 పాయింట్లు నష్టపోయి 38,585కు పడిపోయింది. నిఫ్టీ 87 పాయింట్లు కోల్పోయి 11,584కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (4.68%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.78%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (0.61%), కోల్ ఇండియా (0.55%), సన్ ఫార్మా (0.36%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిల్ టెల్ (-3.28%), ఏషియన్ పెయింట్స్ (-2.15%), టీసీఎస్ (-2.12%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.07%), హెచ్డీఎఫ్సీ (హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ -1.96%).

More Telugu News