Telangana: తెలంగాణలో రేపు పోలింగ్ .. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ

  • తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 34,604 పోలింగ్ కేంద్రాలు
  • ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ
  • రేపు ఉదయం 7 నుంచి సాయంకాలం 5 గంటల వరకు పోలింగ్
తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈవీఎంలను పరిశీలించి ఆయా కేంద్రాలకు సిబ్బంది తీసుకెళ్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే, నిజామాబాద్ లో మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 34,604 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Telangana
Loksabha
17 constituencies
EC

More Telugu News