Andhra Pradesh: టీడీపీ తరఫున ప్రచారం.. ఇంటిని ఖాళీ చేయాలని ఓనర్ ఆదేశం!

  • గుంటూరు జిల్లాలోని కందులవారిపాలెంలో ఘటన
  • ఇటీవల టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్న శేషాచారి
  • ఇంటి ఓనర్ లక్ష్మారెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీడీపీకి మద్దతు ఇస్తున్నారన్న కారణంతో ఇంటిని ఖాళీ చేయాలని దాని యజమాని ఆదేశించారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా సామాన్లను బయటకు విసిరేశారు. దీంతో ఆ కుటుంబం మరో ఇంటికి మారిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కందులవారిపాలెంలో శేషాచారి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇక్కడే లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఇంటిలో వీరు అద్దెకు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరఫున శేషాచారి పాల్గొన్నారు. ఇది నచ్చని లక్ష్మారెడ్డి నిన్న రాత్రి 11 గంటల సమయంలో వచ్చి ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికిప్పుడు తమకు మరో ఇల్లు దొరకాలంటే కష్టమనీ, కొంత గడువు ఇవ్వాలని కోరినా వినిపించుకోలేదు. సామాన్లను ఇంటి నుంచి బయటపడేశారు. దీంతో వేరే మార్గం లేకపోవడంతో శేషాచారి మరో ఇంటికి మారిపోయారు.
Andhra Pradesh
Telugudesam
hose owner
angry
Guntur District

More Telugu News