Andhra Pradesh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ పూనమ్ కౌర్!

  • ఉదయాన్నే స్వామివారి దర్శనం
  • మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగిన నటి
  • ఆలయ సిబ్బందితో సెల్ఫీలు

ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల సందర్భంగా రద్దీ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన  పూనమ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా ఆలయ సిబ్బందితో పూనమ్ ఫొటోలు దిగారు. సార్వత్రిక ఎన్నికలకు ఒక్కరోజు ముందు పూనమ్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News