shashilalita: జయలలిత చివరి రోజులు ప్రధానాంశంగా 'శశిలలిత'!

  • జయలలితపై పలు బయోపిక్ లు
  •  ఆమె జీవితచరిత్రగా 'శశిలలిత'
  • ఆసుపత్రి నేపథ్యమే ప్రధాన ఇతివృత్తం 

ముఖ్యమంత్రిగా తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన జయలలిత, రాజకీయపరమైన ప్రతి విషయంలోను తనదైన ముద్ర వేశారు. సాహసోపేతమైన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. అలాంటి జయలలిత బయోపిక్ ను వివిధ కోణాల్లో .. వివిధ పేర్లతో తెరపైకి తీసుకురావడానికి కొంతమంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో కేతినేని జగదీశ్వరరెడ్డి చేరిపోయారు.

 చివరి రోజుల్లో జయలలిత ఆసుపత్రిలో వున్న 75 రోజుల్లో ఏం జరిగిందనే విషయాన్నే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తాను ఈ సినిమా చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఆమె బాల్యం .. కథానాయికగా సాగించిన ప్రయాణం .. రాజకీయ ప్రవేశం .. శశికళతో అనుబంధం గురించి టచ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సినిమాకి 'శశిలలిత' అనే టైటిల్ ను ఖరారు చేశాననీ .. జయలలిత పట్ల తనకి గల అభిమానం కారణంగానే ఈ సినిమా చేయనున్నానని చెప్పారు. అయితే చాలాకాలం క్రితం ఆయన ప్రకటించిన 'లక్ష్మీస్ వీరగ్రంథం' ఏ పరిస్థితుల్లో వుందో ప్రస్తావించకుండా, 'శశిలలిత' అనే మరో బయోపిక్ ను ప్రకటించడం పబ్లిసిటీ కోసమేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

More Telugu News