rafale deal: రాఫెల్ కేసులో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ

  • రాఫెల్ డీల్ పై రివ్యూ పిటిషన్లు వేసిన శౌరీ, ప్రశాంత్ భూషణ్
  • విచారణ కొనసాగుతుందన్న సుప్రీంకోర్టు
  • విచారణ తేదీని ఖరారు చేస్తామంటూ వ్యాఖ్య

రాఫెల్ యుద్ధ విమానాల డీల్ కు సంబంధించిన కేసు విచారణలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై వేసిన రివ్యూ పిటిషన్లను తిరస్కరించాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. విచారణ తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపింది. మరోవైపు, రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయన్న కేంద్ర వాదనతో కోర్టు ఏకీభవించలేదు.

రాఫెల్ డీల్ పై మరోసారి విచారణ జరపాలంటూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లు రివ్యూ పిటిషన్లను వేశారు. ఈ పిటిషన్లను కొట్టి వేయాలంటూ కోర్టును కేంద్రం కోరింది. అయితే, పిటిషనర్లు సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా విచారణ జరుగుతుందని సుప్రీం తెలిపింది.

More Telugu News