Telangana: టీఆర్ఎస్ ప్రచారానికి అద్భుతమైన స్పందన వస్తోంది.. కాంగ్రెస్, బీజేపీలు కనీస పోటీ ఇవ్వలేవు!: మంత్రి శ్రీనివాసగౌడ్

  • కేసీఆర్ పథకాలను ప్రజలు ఆదరించారు
  • ఈసారి 16 లోక్ సభ సీట్లు గ్యారెంటీ
  • మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేత
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమకు కనీస పోటీ కూడా ఇవ్వలేవని టీఆర్ఎస్ నేత, మంత్రి శ్రీనివాస గౌడ్ తెలిపారు. ప్రజల నుంచి టీఆర్ఎస్ కు అనుకూలంగా అద్భుతమైన స్పందన వస్తోందని వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి తరపున ఈరోజు మహబూబ్ నగర్ లో ప్రచారం నిర్వహించిన శ్రీనివాసగౌడ్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి  కార్యక్రమాలను ప్రజలు ఆదరించారని గుర్తుచేశారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 16 స్థానాలను దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు గత ఎన్నికల్లో ఓడిపోయినవారిని, ఇతర ప్రాంతాలవారిని పోటీకి దించాయనీ, వాళ్లందరికీ ఈసారి కూడా ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు.
Telangana
TRS
Congress
BJP
mahabubnagar
srinivas goud
loksabha
election

More Telugu News