Andhra Pradesh: జగనే ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు సరైన లీడర్.. ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వండి!: హీరో రాజశేఖర్

  • జగన్ ను గతంలో అపార్థం చేసుకున్నాను
  • ఇప్పుడు అతనే సరైన లీడర్ అని నమ్ముతున్నా
  • నేనేమీ పెద్ద పెద్ద ప్యాకేజీలు పుచ్చుకోలేదు
వైసీపీ అధినేత జగన్ ను అప్పట్లో తాను నమ్మలేదనీ, అపార్థం చేసుకున్నానని ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ తెలిపారు. కానీ ఇన్నేళ్ల కాలంలో జగన్ లో నిజమైన మార్పును తాను గమనించానని వ్యాఖ్యానించారు. జగన్ ఆంధ్రప్రదేశ్ కు సరైన లీడర్ అని తాను ఇప్పుడు నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రజలను కోరారు. తాను జగన్ కు మద్దతుగా నిలబడుతున్నానని స్పష్టం చేశారు. ఇటీవల భార్య జీవితతో కలిసి రాజశేఖర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పటికే ఎన్నో అవకాశాలు ఇచ్చామని రాజశేఖర్ తెలిపారు. ఇప్పుడు జగన్ కు ఓసారి ఛాన్స్ ఇవ్వాలన్నారు. ఈ మాటను తాను నిజాయతీగా చెబుతున్నాననీ, ఇందుకోసం తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ పెద్దపెద్ద ప్యాకేజీలు పుచ్చుకోలేదని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో కొందరు తన కుటుంబ సభ్యులపై తప్పుడు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ అబద్ధాలేనని తేల్చిచెప్పారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రాజశేఖర్ ఈరోజు వరుస ట్వీట్లుచేశారు.
Andhra Pradesh
Jagan
YSRCP
Tollywood
rajasekhar

More Telugu News