charan: 'ఆర్ ఆర్ ఆర్' కోసం తెలుగు నేర్చుకుంటోన్న అలియా భట్

  • షూటింగు దశలో రాజమౌళి సినిమా 
  • చరణ్ జోడీగా అలియా భట్ 
  • త్వరలోనే షూటింగులో జాయిన్ కానున్న అలియా
హిందీలో అలియా భట్ కి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. యూత్ లో తనకి గల క్రేజ్ ను బట్టి ఆమె తన పారితోషికాన్ని పెంచుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేయడానికి అంగీకరించింది. హిందీలోనూ 'బాహుబలి' భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వలన, రాజమౌళి ప్రాజెక్టు అనగానే ఆమె అంగీకరించింది.

చరణ్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. త్వరలో ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుంది. అలియాకి తెలుగు రాదు ..  భాష అర్థమైతేనే భావాలను సరిగ్గా పలికించగలుగుతామనే ఆర్టిస్టులలో అలియా ఒకరు. అందువలన ఆమె ప్రత్యేకంగా ఒక ట్యూటర్ ను పెట్టుకుని తెలుగు భాష నేర్చుకుంటోందట. నటన పట్ల అలియాకి గల అంకితభావానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
charan
aliya bhatt

More Telugu News