Telugudesam: ఏపీలో అత్యధిక లోక్‌సభ స్థానాలు టీడీపీకే దక్కుతాయి!: రిపబ్లిక్ టీవీ-సీఓటర్ సర్వేలో వెల్లడి

  • టీడీపీకి 14, వైసీపీకి 11 స్థానాలు
  • టీడీపీకి 38.5 శాతం ఓట్ల శాతం.. వైసీపీకి 36.4 శాతం ఓట్లు
  • బీజేపీ, కాంగ్రెస్‌లకు రిక్త హస్తం

ఏపీలో ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని జాతీయ న్యూస్ చానల్ రిపబ్లిక్ టీవీ పేర్కొంది. ఈ మేరకు ‘సీ ఓటర్’ సర్వే వివరాలను టీవీ వెల్లడించింది. దేశంలో పలు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 11న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక సీ ఓటర్-రిపబ్లిక్ టీవీ వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం..

ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 14 స్థానాలు, వైసీపీ 11 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒక్క సీటు కూడా రాదని తేల్చేసింది. కాగా, జనవరి అంచనాల ప్రకారం వైసీపీ 19 స్థానాలు, టీడీపీ 6 స్థానాలు గెలుచుకుంటుందని తేలగా, రెండు నెలల్లోనే పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చినట్టు రిపబ్లిక్ టీవీ పేర్కొంది.

ఇక, ఓట్ల శాతాన్ని చూస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 36.4 శాతం ఓట్లను సొంతం చేసుకోగా, టీడీపీ 38.5 శాతం, ఇతరులు 8.2 శాతం ఓట్ల శాతాన్ని సాధిస్తాయని వివరించింది. ఇక యూపీఏ 10.4 శాతం, ఎన్‌డీఏ 6.5 శాతంతో సరిపెట్టుకుంటాయని అంచనా వేసింది.

  • Loading...

More Telugu News