Chandrababu: డేటా సెంటర్ నీ అబ్బ సొమ్మా?: కేసీఆర్‌పై విరుచుకుపడిన చంద్రబాబు

  • మా డేటా తీసుకెళ్లి కోడికత్తి పార్టీకి ఇస్తావా?
  • మా కష్టం అనుభవిస్తూ మాపైనే నిందలా?
  • వస్తా.. నీ కథ చూస్తా

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై ఏపీ సీఎం చంద్రబాబు మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను వారం రోజులపాటు ఉతికి ఆరేశానని పెడనలో పేర్కొన్న చంద్రబాబు మచిలీపట్నంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని డేటా సెంటర్ నీ అబ్బ సొమ్మా? అని ప్రశ్నించారు. తన ఆస్తిని అడగడానికి నువ్వెవరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన డేటాను తీసుకెళ్లి కోడికత్తి పార్టీకి ఇస్తావా? అని కేసీఆర్‌ను నిలదీశారు. ఎంతధైర్యం నీకు? అని ప్రశ్నించారు.

తమ వారిపై తప్పుడు కేసులు బనాయిస్తుంటే నిన్ను చూస్తూ ఊరుకోనని, ‘‘వస్తా.. నీ కథ చూస్తా’’ అని తీవ్రస్థాయిలో కేసీఆర్‌ను హెచ్చరించారు. తమ కష్టం అనుభవిస్తూ తమనే అంటారా? అని నిలదీశారు. తనకు తెలివి లేదని, కేసీఆర్‌కు బాగా తెలివి ఉందని మోదీ ప్రశంసించారని ఎద్దేవా చేశారు. జగన్, కేసీఆర్, మోదీలను కట్టకట్టి బంగాళాఖాతంలో విసిరేద్దామని అన్నారు. తమతో పెట్టుకుంటే మోదీ ఏమయ్యారో మీరూ అదే అవుతారని కేసీఆర్‌ను హెచ్చరించారు.

  • Loading...

More Telugu News