Kurnool District: లక్ష్మీపార్వతిపై ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడతారా? వాళ్లకు అమ్మ, చెల్లి లేరా?: వైఎస్ విజయమ్మ ఫైర్

  • ఇలాంటి వ్యాఖ్యలు చేయడం న్యాయమా? ధర్మమా?
  • ఆడవాళ్లను గౌరవించని ముఖ్యమంత్రి అవసరమా?
  • బాబుకు, ఆయనకు వంతపాడే పత్రికలపై విజయమ్మ ఫైర్
వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఖండించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షో లో ఆమె మాట్లాడుతూ, ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలా? చంద్రబాబునాయుడు, ఆయనకు వంతపాడే పత్రికలు లక్ష్మీపార్వతి గురించి తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉచ్ఛనీచాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం న్యాయమా? ధర్మమా? అని ప్రశ్నించారు. ‘వాళ్లకు అమ్మ, చెల్లి లేరా? ఆడవాళ్లను గౌరవించని ముఖ్యమంత్రి అవసరమా?’ అని ప్రశ్నించారు.
Kurnool District
YSRCP
YS Vijayamma
Telugudesam

More Telugu News