Tirupati: దాదర్ రైల్వే స్టేషన్‌లో తిరుపతి వజ్ర కిరీటాల దొంగ అరెస్ట్!

  • ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు
  • నిందితుడి కదలికలపై నిఘా
  • పూర్తి విచారణ నిర్వహించనున్న పోలీసులు
తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో రెండు నెలల క్రితం వజ్రాలు పొదిగిన మూడు కిరీటాలు చోరీకి గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తిరుపతి పోలీసులు, నిఘా విభాగం అధికారులు ఏడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆలయంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఓ వ్యక్తిని గుర్తించి, అతనికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఆ వ్యక్తిని మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి అతడి కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో నిందితుడు పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు నేడు దాదర్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. తిరుపతికి తీసుకొచ్చి పూర్తి స్థాయి విచారణ నిర్వహించనున్నారు.
Tirupati
Govinda Raja Swamy
CCTV
Maharashtra
Nanded

More Telugu News