jagan: చంద్రబాబునే మళ్లీ సీఎం చేయండి: దేవెగౌడ

  • రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారు
  • జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు
  • దేశంలోని వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మఖ్యమంత్రిగా చంద్రబాబును మరోసారి ఎన్నుకోవాలని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ పిలుపునిచ్చారు. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వైసీపీ అధినేత జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని...ఇదే సమయంలో రాష్ట్రం కోసం అహర్నిశలు చంద్రబాబు కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతివ్వాలని కోరారు. అమరావతిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పేపర్ బ్యాలెట్ కోసం తాము చేస్తున్న పోరాటం కొనసాగుతుందని దేవెగౌడ తెలిపారు. మోదీ ప్రభుత్వం దేశంలోని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కూటమి బలంగా ఉందని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులపై ఐటీ శాఖను ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను ఏక తాటిపైకి తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు.
jagan
Chandrababu
modi
devegowda
Telugudesam
jds
bjp

More Telugu News