nikki galrani: ఇక్కడ అలాంటి లింకులు ఉంటాయనేది పుకారు మాత్రమే: హీరోయిన్ నిక్కీ గల్రాని

  • కెమెరామెన్లతో సంబంధాలు ఉండవు
  • ఎవరిపనిపై వాళ్లు దృష్టి పెడతారు 
  • ఒకరినొకరం గౌరవించుకుంటాము     

తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిక్కీ గల్రాని, తెలుగు తెరకి 'కృష్ణాష్టమి' చిత్రం ద్వారా పరిచయమైంది. అయితే ఈ సినిమా పరాజయంపాలు కావడం వలన, ఇక్కడ ఆమెకి అవకాశాలు రాలేదు. దాంతో ఆమె ఇతర భాషా చిత్రాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. తమిళంలో ఆమె తాజా చిత్రంగా 'కీ' రూపొందింది. జీవా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా వుంది. తాజా ఇంటర్వ్యూలో .. "తెరపై అందంగా కనిపించడం కోసం కెమెరామెన్లతో హీరోయిన్లు లింకులు పెట్టుకుంటారు అనే ప్రచారంలో ఎంతవరకూ నిజం వుంది?" అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అందుకు ఆమె తనదైన శైలిలో స్పందిస్తూ .. "హీరోయిన్లు తెరపై మరింత అందంగా కనిపించడంలో కెమెరామెన్ల పాత్ర ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతమాత్రాన వాళ్లతో హీరోయిన్లకి సంబంధాలు ఉంటాయనుకోవడం పొరపాటు. సినిమా బాగా రావాలంటే వాళ్ల పని వాళ్లు .. మా పని మేము చేస్తుంటాము. ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవించుకుంటూ ఉంటాము" అని చెప్పుకొచ్చింది. 

More Telugu News