YS Vijayamma: భన్వర్ లాల్ కు, రోజాకు సంబంధం అంటగట్టమని చెప్పమనడానికి చంద్రబాబుకు సిగ్గుందా?: వైఎస్ విజయమ్మ ఆగ్రహం

  • స్త్రీలను గౌరవించే విధానం ఇదేనా?
  • మహిళల మానప్రాణాలతో రాజకీయాలా?
  • విజయమ్మ ఎన్నికల ప్రచారం
వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన కుమారుడు జగన్ కోసం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. తాజాగా విజయమ్మ శింగనమల వద్ద రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో నిజమైన రౌడీ చంద్రబాబే అని, భన్వర్ లాల్ కు, రోజాకు సంబంధం ఉందని చెప్పమనడం ఆయన నీచ మనస్తత్వానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చంద్రబాబు మహిళల మానప్రాణాలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబూ నీకు సిగ్గుందా? స్త్రీలను గౌరవించే పద్ధతి ఇదేనా? అంటూ నిలదీశారు.

"ఆమంచి కృష్ణమోహన్ చెప్పిన విషయాలను ఇవాళే పేపర్లో చూశాను. నంద్యాల ఎలక్షన్స్ లో చెప్పినట్టు వినలేదని  అప్పటి ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ కు రోజాతో సంబంధం అంటగట్టమని చంద్రబాబు కాన్ఫరెన్స్ లో చెప్పాడట. ఏమన్నా బుద్ధి ఉన్న ముఖ్యమంత్రేనా అని అడుగుతున్నా!" అంటూ నిప్పులు చెరిగారు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ, తన పుట్టిల్లు అనంతపురం జిల్లానే అని, ఈ జిల్లా మనవడైన జగన్ ను ఆశీర్వదించాలని కోరారు. ఆనాడు వైఎస్సార్ ప్రజల కోసం వెళ్లే క్రమంలోనే ప్రాణాలు విడిచారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
YS Vijayamma
YSRCP
Chandrababu

More Telugu News