Naga Chaitanya: ఇండిగో విమానంలో చైతూ, సమంత... ఫిదా అవుతున్న నెటిజన్లు!

  • 'మజిలీ'తో హిట్ కొట్టిన చై, సామ్
  • విమానంలో సేదదీరుతున్న సమంత
  • భర్త భుజంపై తలపెట్టి నిద్ర

మూడు రోజుల క్రితం విడుదలైన 'మజిలీ' హిట్ టాక్ ను తెచ్చుకోగా, ఆనందంగా ఉన్న స్టార్ కపుల్ నాగచైతన్య, సమంతల తాజా ఫోటో ఒకటి ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఇండిగోకు చెందిన ఓ విమానంలో వీరిద్దరూ వెళుతున్న వేళ, చైతూ తన ల్యాప్ టాప్ చూసుకుంటూ బిజీగా ఉండగా, సమంత మాత్రం తన భర్త భుజంపై తల పెట్టి నిద్రపోతోంది. ఆ సమయంలో తీసిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సమంత పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఆఖరికి..  ఏదీ దీనికి సాటి రాదు" అన్న అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టింది. ఇక దీన్ని నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.






View this post on Instagram









In the end ... nothing else matters

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

More Telugu News