A-Sat: ఇటీవల నిర్వహించిన 'ఏ-శాట్' మిసైల్ ప్రయోగంపై వీడియోను విడుదల చేసిన రక్షణశాఖ!

  • మార్చి 27న ప్రయోగం
  • 283 కిలోమీటర్ల ఎత్తున ఉన్న శాటిలైట్ పేల్చివేత
  • ఫేస్ బుక్ లో వీడియోను పోస్ట్ చేసిన డిఫెన్స్ మినిస్ట్రీ

ఇటీవల ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని ప్రయోగించి, 'మిషన్ శక్తి'ని విజయవంతం చేసిన భారత్, అమెరికా, రష్యా, చైనాల సరసన నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఎర్త్ లోయర్ ఆర్బిట్ లో ఉన్న ఉపగ్రహాన్ని ఏ-శాట్ ఎలా పేల్చివేసిందో తెలియజేస్తూ, రక్షణ శాఖ ఓ వీడియోను విడుదల చేసింది. దాదాపు 283 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ ను 3 నిమిషాల్లో కూల్చివేసేలా ఈ ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఒడిశాలోని కలామ్ ఐలాండ్ నుంచి మార్చి 27న ఈ ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. మూడు దశల్లో ప్రయోగం పూర్తికాగా, ఈ వీడియోను డిఫెన్స్ మినిస్ట్రీ, తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News