regina: కుర్ర హీరోతో ప్రేమాయణంపై రెజీనా స్పందన

  • ఈ వార్తలు నేనూ వింటున్నా
  • నేను ఎవరి ప్రేమలో లేను
  • ఎవరినైనా ప్రేమిస్తే ముందు మీకే చెబుతా
టాలీవుడ్, కోలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి కథానాయికగా గుర్తింపు పొందిన నటి రెజీనా... ఆ తర్వాత తెలుగులో కొంచెం వెనకబడింది. తమిళంలో మాత్రం ఆమె బిజీగానే ఉంది. ఇదే సమయంలో ఓ హీరోతో ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ వార్తలపై రెజీనా స్పందిస్తూ... గత కొన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలను తానూ చూస్తున్నానని, ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని చెప్పింది. తాను ఎవరి ప్రేమలో లేనని... ఎవరినైనా ప్రేమిస్తే ముందుగా మీకే చెబుతానని తెలిపింది. ప్రస్తుతం తన వృత్తినే తాను ప్రేమిస్తున్నానని చెప్పింది.
regina
tollywood
kollywood
love

More Telugu News