ఎన్నికల నిర్వహణ ఖర్చులో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన నిజామాబాద్!
- లోక్ సభ ఎన్నికల్లో 185 మంది పోటీ
- రూ. 35 కోట్ల వరకూ ఎన్నికల ఖర్చు
- 25 వేలకు పైగా ఈవీఎంల వినియోగం
స్వతంత్ర భారతావనిలో ఓ లోక్ సభ నియోజకవర్గ ఎన్నిక నిర్వహించడానికి ఈసీ వెచ్చిస్తున్న అత్యధిక మొత్తం ఇదే కావడం గమనార్హం. ఇక ఎన్నికలు సజావుగా సాగడానికి 400 మంది ఇంజనీర్లను ఈసీ సిద్ధం చేసింది. అత్యవసరమైతే వినియోగించేందుకు ఓ హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచింది. మొత్తం 1,788 పోలింగ్ కేంద్రాల్లో ఒక వీవీ ప్యాట్, ఒక కంట్రోలింగ్ యూనిట్, 12 ఈవీఎంలు ఉంటాయి. సాధారణంగా ఒక్కో పోలింగ్ బూత్ లో నలుగురు సిబ్బంది ఉంటుండగా, నిజామాబాద్ పరిధిలో మాత్రం మరో ఇద్దరిని అదనంగా నియమించనుంది.