Guntur: వైసీపీ, టీడీపీలు విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి: కన్నా లక్ష్మీనారాయణ

  • నరసరావుపేటలో ఏ పార్టీతో తనకు పోటీ లేదు
  • డబ్బుకు, తనకు మధ్యే పోటీ జరుగుతోంది
  • అభివృద్ధి కావాలనుకునే వాళ్లు తనకు ఓటేస్తారన్న కన్నా 

నరసరావుపేటలో వైసీపీ, టీడీపీలు విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నాయని అక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, నరసరావుపేటలో ఏ పార్టీతో తనకు పోటీ లేదని, డబ్బుకు తనకు మధ్య పోటీ జరుగుతోందని ఆయా పార్టీలపై ఆరోపణలు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్లు తనకు తప్పకుండా ఓటు వేస్తారని అన్నారు.

1989లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి పోటీ చేసినప్పుడు, ఆ ఊరు గురించి తనకు, తన గురించి అక్కడి ప్రజలకు ఏం తెలియదని, ‘నన్ను నమ్మి ఓటెయ్యండి, నేను మీ వెంట ఉంటాను’ అని ఆరోజున అక్కడి ప్రజలకు చెప్పానని, అలాగే, వాళ్లు చేశారని, ఆ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని కన్నా గుర్తుచేసుకున్నారు. ఈరోజు నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు కూడా అదే హామీ ఇస్తున్నానని చెప్పారు.

 పల్నాడు ప్రాంతంలో వరకపూడిశిల ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా కన్నా హామీ ఇచ్చారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తాను పట్టుబడితే ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన జరిగిందని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. 

  • Loading...

More Telugu News