Krishna District: ‘తాతయ్య ఎక్కడికి వెళ్తున్నావ్? అని నా మనవడు అడిగాడు: చంద్రబాబు

  • నందిగామలో టీడీపీ ఎన్నికల ప్రచార సభ
  • ఈ సభకు చంద్రబాబు సహా బ్రాహ్మణి, దేవాన్ష్ హాజరు
  • నా కష్టమేంటో తెలియజెప్పాలని దేవాన్ష్ ను తీసుకొచ్చా
కృష్ణా జిల్లాలోని నందిగామలో టీడీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కోడలు నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన మనవడు దేవాన్ష్ ను ఈ సభకు తీసుకురావడానికి గల కారణాన్ని వివరించారు.

తాను ప్రతిరోజూ ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వచ్చే ముందు ‘తాతయ్య ఎక్కడికి వెళ్తున్నావ్? అని మనవడు దేవాన్ష్ తనను అడుగుతుంటాడని చెప్పారు. ‘మీటింగ్ కు పోతున్నాను’ అని  తన మనవడికి చెప్పానని అన్నారు. ‘మా వాడికి నా కష్టం తెలియాలని అనిపించింది. కాబట్టి, ఈ మీటింగ్ కు తీసుకొచ్చాను’ అని చెప్పారు. రాష్ట్రంలోని పిల్లలంతా తనకు మనవళ్లు, మనవరాళ్లతో సమానమని, పేద పిల్లలందరినీ ఇంజనీర్లు, డాక్టర్లు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.  ప్రపంచానికే సేవలందించే స్థాయికి ఏపీ యువత రావాలని, ఇంటర్ విద్యార్థులకు ఐ ప్యాడ్, ల్యాప్ టాప్ లు ఇస్తామని, ఇలాంటి ఆలోచనలు వైసీపీకి వస్తాయా? అని ప్రశ్నించారు.
Krishna District
nandigama
cm
Chandrababu

More Telugu News