Andhra Pradesh: నేను అందరివాడిలా ఉంటా: సీఎం చంద్రబాబునాయుడు

  • కేసీఆర్ కు, వైసీపీకి లాలూచీ ఉంది
  • ఏపీని అణగదొక్కాలని కేసీఆర్ చూస్తున్నారు
  • లోటస్ పాండ్ లో కూర్చొని కుట్రలు
తన కులం ‘అభివృద్ధి’, తన మతం ‘సంక్షేమం’ అని, ‘నేను అందరివాడిలా ఉంటా’ అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, తల్లీబిడ్డలను ఎక్స్ ప్రెస్ ద్వారా ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామని, బిడ్డలు భారం కాదు, బడికి పంపండి, బడికి పంపిస్తే తల్లిదండ్రులకు ఏటా రూ.18 వేలు ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కేసీఆర్ కు, వైసీపీకి లాలూచి అని, ఏపీని అణగదొక్కాలని కేసీఆర్ చూస్తున్నారని, మోదీ, కేసీఆర్, జగన్ కుమ్మక్కై, లోటస్ పాండ్ లో కూర్చొని కుట్రలు పన్నుతున్నారని, ఆంధ్రులపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 
Andhra Pradesh
cm
Chandrababu
nandigama

More Telugu News