Vivek Oberoi: రాజకీయాల్లో చేరితే వడోదర నుంచి పోటీ చేస్తా: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్

  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే వడోదర నుంచే బరిలోకి
  • అక్కడి ప్రజలు చూపించే ప్రేమ, ఆప్యాయత నన్ను కట్టిపడేశాయి
  • మోదీ బయోపిక్‌లో చేయడానికి ముందు ఆయన ఆహార్యాన్ని పరిశీలించా
బాలీవుడ్ అగ్రనటుడు వివేక్ ఒబెరాయ్ మనసులో మాట బయటపెట్టాడు. ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్‌లో నటించిన వివేక్ తాజాగా మాట్లాడుతూ.. తాను కనుక రాజకీయాల్లో చేరితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో వడోదర నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నాడు. ‘‘నేను కనుక రాజకీయాల్లో చేరితే, వచ్చే ఎన్నికల్లో వడోదర నుంచి పోటీ చేసేందుకే మొగ్గుచూపుతా. మోదీ అక్కడి నుంచి పోటీ చేసినప్పుడు అక్కడి ప్రజలు చూపించిన ఆప్యాయత, అనురాగం నన్ను ఆకట్టుకున్నాయి’’ అని ఒబెరాయ్ పేర్కొన్నాడు.

పారుల్ యూనివర్సిటీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వివేక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. నరేంద్రమోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’లో నటించడానికి ముందు ఆయన ఆహార్యం, మాట్లాడే తీరును క్షుణ్ణంగా పరిశీలించినట్టు చెప్పాడు. ఎటువంటి  నేపథ్యం లేకుండా, కులరాజకీయాలకు అతీతంగా ప్రధానిగా, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరిగా మోదీ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమన్నాడు.
Vivek Oberoi
Vadodara
politics
PM Narendra Modi
Bollywood

More Telugu News