UPSC: మా అబ్బాయి సివిల్స్ రాస్తానని చెప్పగానే డబ్బు కోసం ఇంటిని అమ్మేశా: '93వ ర్యాంకర్' ప్రదీప్ తండ్రి

  • అఖిల భారత స్థాయిలో ప్రదీప్‌కు 93వ ర్యాంకు
  • పెట్రోలు బంకులో పనిచేస్తున్న తండ్రి
  • పిల్లలకు మంచి చదువు ఇవ్వాలనేదే తన తాపత్రయమన్న మనోజ్

సివిల్స్‌ రాస్తానన్న తన కుమారుడి ఆశలు తీర్చడానికి తన ఇంటిని కూడా అమ్మేశానని బీహార్‌కు చెందిన సివిల్స్ ర్యాంకర్ ప్రదీప్ సింగ్ తండ్రి మనోజ్ సింగ్ తెలిపాడు. 22 ఏళ్ల ప్రదీప్ యూపీఎస్‌సీ ఫలితాల్లో 93వ ర్యాంకు సాధించాడు. తన కుమారుడికి అఖిల భారత స్థాయిలో 93వ ర్యాంకు వచ్చిన విషయం తెలియగానే మనోజ్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పిల్లల్ని ఎప్పుడూ గొప్ప చదువులు చదివించాలనే అనుకున్నానని పేర్కొన్నాడు. సివిల్స్ రాస్తానని ప్రదీప్ చెప్పినప్పుడు డబ్బుల కోసం ఉంటున్న ఇంటిని సైతం అమ్మేశానని గుర్తు చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ పెట్రోలు బంకులో పనిచేస్తున్న మనోజ్.. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పాడు. అయినప్పటికీ పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చూసుకున్నానని, వారిని బాగా చదివిస్తే మంచి జీవితం ఇచ్చినట్టేనని భావించేవాడినని చెప్పుకొచ్చాడు.

More Telugu News