satyavedu: గత నెలలో టీడీపీలో చేరిన సత్యవేడు మాజీ ఎమ్మెల్యే.. ఇప్పుడు వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటన!

  • గత నెల 15న చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం
  • టికెట్ దక్కకపోవడంతో రెబల్‌గా నామినేషన్
  • తనకు వైసీపీ నుంచి పిలుపు వచ్చిందని ప్రకటన

గత నెల 15న నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన సత్యవేడు మాజీ ఎమ్మెల్యే ఎం.సురాజ్ పార్టీని వీడనున్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు వైసీపీ నుంచి పిలుపొచ్చిందని, త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ నిలకడగా ఉండని సురాజ్ 1983, 1994 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచారు. 1997లో లక్ష్మీపార్వతి పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీల్లోనూ చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో గతనెల 15న నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే, అదే రోజున సత్యవేడుకు జేడీ రాజశేఖర్‌ను టీడీపీ తమ అభ్యర్థిగా ప్రకటించడంతో సురాజ్ ఆశలు నీరుగారాయి. దీంతో ఆయన టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగి నామినేషన్ వేశారు. నామినేషన్ వేసినప్పటికీ ప్రచారానికి దూరంగా ఉన్న ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మరీ తనకు వైసీపీ నుంచి పిలుపొచ్చిందని చెప్పారు.

  • Loading...

More Telugu News