Hyderabad: హైదరాబాద్‌లో కార్లలో తరలిస్తున్న రూ.1.34 కోట్ల స్వాధీనం

  • హైదరాబాద్‌లో విస్తృత తనిఖీలు
  • బంజారాహిల్స్‌లో పట్టుబడిన కోటి రూపాయలు
  • మలక్‌పేటలో ఓ బిల్డర్ నుంచి రూ. 34.30 లక్షలు స్వాధీనం
కారులో తరలిస్తున్న కోటి రూపాయలను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపి తనిఖీ చేయగా అందులో కోటి రూపాయల నగదు కనిపించింది. ఆ డబ్బుకు సంబంధించి వివరాలను ఆ డబ్బు తరలిస్తున్న వ్యక్తిని కోరగా, అతడి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో సదరు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. మలక్‌పేటలో నిర్వహించిన తనిఖీల్లో ఎల్బీనగర్‌కు చెందిన కాంట్రాక్టర్ కాశీనాథ్ రెడ్డి  కారు నుంచి రూ.34.30 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
Hyderabad
Banjarahills
Malakpet
Police
Currency
Telangana
Elections

More Telugu News