Amit Shah: అదంతా దుష్ప్రచారం.. మోదీకి నేను పోటీ కాదు: అమిత్ షా

  • పదవుల కోసం కాదు, ప్రజామోదం కోసమే పోటీ 
  • బీజేపీ అభ్యర్థులకు ఎదురుగాలి వార్తలు తప్పు
  • పార్టీ నిబంధనల ప్రకారమే అద్వానీకి టికెట్ ఇవ్వలేదు

ప్రజామోదం పొందేందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను తప్పితే ప్రధాని పదవిపై ఆశ లేదని, మోదీకి తాను పోటీ కాదని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మోదీకి తాను పోటీ కాబోతున్నానంటూ వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు. ప్రధాని రేసులో తాను లేనని స్పష్టం చేశారు. ప్రజల ఆమోదం పొందేందుకే తాను ఎన్నికల బరిలో దిగుతున్నాను తప్పితే, పదవుల కోసం కాదని తేల్చి చెప్పారు.

దేశంలో మోదీ హవా ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తోందంటూ వస్తున్న వార్తలపైనా అమిత్ షా స్పందించారు. ఆ విమర్శల్లో అర్థం లేదన్నారు. అదంతా దుష్ప్రచారమని కొట్టి పడేశారు. 75 ఏళ్లకు పైబడిన వాళ్లకు టికెట్లు ఇవ్వకూడదన్న పార్టీ నిబంధన ప్రకారమే సీనియర్ నేత అద్వానీకి టికెట్ ఇవ్వలేదన్నారు. యూపీలో దళిత సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీలను మార్చినట్టు వస్తున్న ఆరోపణలను షా ఖండించారు.

More Telugu News