Chandrababu: ఆంధ్రులతో పెట్టుకున్నవాడెవడూ బాగుపడలేదు: పొన్నూరులో చంద్రబాబు శాపనార్థాలు

  • మోదీ, అమిత్ షా ఏంచేయాలనుకుంటున్నారు?
  • అధికారం శాశ్వతం కాదు
  • జాగ్రత్తగా ఉండండి

టీడీపీ సుప్రీమ్ చంద్రబాబునాయుడు పొన్నూరు రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఐదు కోట్ల మంది ప్రజలు తన వెంటే ఉంటే న్యాయాన్ని గెలిపించడానికి, ధర్మాన్ని కాపాడడానికి రాజీలేని పోరాటం చేస్తానని చంద్రబాబు ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు.

"నేనేమన్నా మోదీని అన్యాయంగా అడిగానా? రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగాను. ప్రత్యేక హోదా అడిగాను. విభజన హామీలు అమలు చేయమని అడిగాను. ఢిల్లీకి 29 సార్లు వెళ్లినా నరేంద్ర మోదీ పట్టించుకోలేదు. చివరి బడ్జెట్ చూసిన తర్వాత మోదీ మోసం బట్టబయలైంది. అందుకే మీకోసం కేంద్రంపై తిరుగుబాటు చేశాను. దేశంలోని మిగతా పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తే మన రాష్ట్రంపై కక్ష కట్టాడు. ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు చేయిస్తున్నాడు. మోదీ గారూ అధికారం శాశ్వతం కాదు. జాగ్రత్తగా ఉండండి. మళ్లీ తెలుగుదేశం పార్టీ అనుకుంటే మిమ్మల్ని గుజరాత్ పంపిస్తాం. ఆంధ్రులతో పెట్టుకుంటే ఎవరూ బాగుపడలేదు. ఎన్టీఆర్ అందించిన ఆత్మవిశ్వాసం ఉంది" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఎస్పీలను ట్రాన్స్ ఫర్ చేస్తారు, కలెక్టర్లను ట్రాన్స్ ఫర్ చేస్తారు. నిన్న సీఎస్ ను కూడా బదిలీ చేశారు. మరి తెలంగాణలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? తెలంగాణలో లాలూచీ పడ్డారు కాబట్టి పోలీసుల వాహనంలో డబ్బులు తీసుకువెళ్లినా పట్టించుకోరు. ఇక్కడ మాత్రం మనపై విరుచుకుపడుతున్నారు. మోదీ, అమిత్ షా ఈ దేశాన్ని ఏంచేయాలనుకుంటున్నారు?" అంటూ చంద్రబాబు నిలదీశారు.

  • Loading...

More Telugu News