Mamatha Banarjee: అధికారులను కాదు, నన్ను తొలగించి చూడండి!: ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ సవాల్

  • మంచి అధికారులను బదిలీ చేస్తున్నారు
  • ఇది సరైన నిర్ణయం కాదు
  • ఈసీ కేంద్రం చెప్పినట్టే చేస్తోంది

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలో అధికారులను బదిలీ చేస్తుండడం పట్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈసీపై అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఏపీలో ఇద్దరు జిల్లా ఎస్పీలతో పాటు ఇంటలిజెన్స్ డీజీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అటు, పశ్చిమ బెంగాల్ లోనూ కొందరు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేయడంపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు.

మరికొన్ని రోజుల్లో పోలింగ్ జరగనుండగా నలుగురు అధికారులను ఈసీ ట్రాన్స్ ఫర్ చేయడంపై మమతా మాట్లాడుతూ, ఈసీ కేవలం అధికారులను మాత్రమే తొలగించగలుగుతోందని, చేతనయితే తనను తొలగించి చూడాలంటూ సవాల్ విసిరారు. విధి నిర్వహణలో ఎంతో నిజాయతీపరులుగా పేరున్న అధికారులను తొలగించడం ఎందుకో తెలియడంలేదని అన్నారు. స్వతంత్ర సంస్థగా వ్యవహరించాల్సిన ఈసీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు.

More Telugu News