Chandrababu: జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణను నమ్ముకుంటే ఏమీ కాదు: చంద్రబాబునాయుడు

  • లక్ష్మీ నారాయణకు ఓటేస్తే మురిగిపోతుంది
  • సీబీఐని మోదీ తన స్వార్థానికి వాడుకున్నారు
  • శ్రీ భరత్ గెలుపు కోసం చంద్రబాబు ప్రచారం

విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను నమ్ముకుంటే ఏమీ కాదని, ఆయనకు ఓటేస్తే మురిగిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ నుంచి తెలుగుదేశం తరఫున పోటీలో ఉన్న శ్రీ భరత్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన ఆయన, లక్ష్మీనారాయణకు ఓటు వేస్తే, అది మురిగిపోయినట్టేనని అన్నారు.

సీబీఐని నరేంద్ర మోదీ స్వార్థానికి వినియోగించుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న ఎంవీవీ సత్యనారాయణ భూకబ్జాదారని, అటువంటి వ్యక్తికి ఓటేస్తే ప్రజలకు ఇబ్బందులేనని అన్నారు. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వారంతా నేరచరిత్ర కలవారేనని, అందరినీ ఓడించాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News