అదే తెలుగోడి సత్తా... నాకెంతో గర్వంగా ఉంది: సివిల్స్ ర్యాంకులపై చంద్రబాబునాయుడు
- సివిల్స్ కు ఎంపికైన వారిలో 40 మంది తెలుగువారు
- అభినందనలు తెలిపిన ఏపీ సీఎం
- అందరినీ సత్కరించాలని అధికారులకు సూచన
ఉగాది పర్వదిన శుభవేళ, తెలుగు యువత సాధించిన విజయాలు ప్రతి ఒక్కరికీ ప్రేరణ కావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సివిల్స్ కు ఎంపికైనవారిలో 40 మంది వరకూ తెలుగువారు ఉన్నారని గుర్తు చేసిన ఆయన, ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ప్రజలకు సమర్థవంతమైన సేవలనందించాలని పిలుపునిచ్చారు.