Scientists: తిమింగలాలకు నాలుగు కాళ్లు ఉండేవట.. భూమిపై నడిచేవట.. లభ్యమైన శిలాజాలు.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు

  • 43 మిలియన్ సంవత్సరాల నాటి తిమింగలం అవశేషం గుర్తింపు
  • పూర్తిగా నీటికే పరిమితం కావడానికి ముందు భూమిపై సంచరించిన వేల్స్
  • నాలుగు కాళ్లతో నడక, పరుగు కూడా..

తిమింగలం.. సముద్రంలో నివసించే అతిపెద్ద జీవి అయిన దీనికి ఒకప్పుడు నాలుగు కాళ్లు ఉండేవట. ఇవి అప్పట్లో ఉభయచర జీవులుగా ఉండేవని తాజాగా లభ్యమైన శిలాజాలను బట్టి శాస్త్రవేత్తలు ఓ నిర్ధారణకు వచ్చారు. 43 మిలియన్ సంవత్సరాల నాటిదిగా చెబుతున్న ఓ శిలాజం పెరూలో లభ్యమైంది. 13 అడుగుల పొడవున్న దీనికి నాలుగు కాళ్లు ఉండడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.

తిమింగలాలు పూర్తిగా నీటికి పరిమితం కావడానికి ముందు భూమిపైనా సంచరించేవని శాస్త్రవేత్తలు తెలిపారు. అవి భూమిపై నడవడం, పరిగెత్తడం కూడా చేసేవని పేర్కొన్నారు. పెరూలో లభ్యమైన ఈ తిమింగలం అవశేషం భారత్, పాకిస్థాన్ ఆవల పసిఫిక్ ప్రాంతం, దక్షిణార్ధగోళంలో లభించిన మొట్టమొదటి శిలాజమని శాస్త్రవేత్తలు వివరించారు.

More Telugu News