Upsc: సివిల్స్‌లో తెలుగు వెలుగు.. 35 మందికిపైగా ర్యాంకులు!

  • సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన తెలుగు తేజాలు
  • మిర్యాలగూడకు చెందిన వరుణ్ రెడ్డి ఏడో ర్యాంకు
  • అమలాపురం కుర్రాడికి 64వ ర్యాంకు

సివిల్స్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశంలోనే అత్యున్నత సర్వీసుగా భావించే ఉద్యోగాల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించిన సివిల్స్ తుది ఫలితాల్లో 35 మందికిపైగా తెలుగు విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు కైవసం చేసుకున్నారు. శుక్రవారం యూపీఎస్‌సీ తుది ఫలితాలను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 35 మందికిపైగా ఎంపికైనట్టు తెలుస్తోంది.

వీరిలో తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన కర్నాటి  వరుణ్‌రెడ్డి 7వ ర్యాంకు సాధించి సత్తా చాటగా, ఐదుగురికి వందలోపు ర్యాంకులు దక్కాయి. అంకితా చౌదరి 14వ ర్యాంకు, శ్రీలక్ష్మి 29వ ర్యాంకు, నాగర్‌కర్నూలు జిల్లా తమ్మన్‌పేటకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ షాహిద్‌ 57వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్ చంద్ 64వ ర్యాంకు, మల్లారపు నవీన్‌ 75వ ర్యాంకు, కడప జిల్లా పందిళ్లపల్లికి చెందిన కేవీ మహేశ్వరరెడ్డి 126 సాధించారు.

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాకకు చెందిన చిట్టిరెడ్డి శ్రీపాల్ 131వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన సిరి మేఘన 171వ ర్యాంకు, హైదరాబాద్‌కే చెందిన శివ నీహారిక 237వ ర్యాంకు సాధించారు. రాజస్థాన్‌కు చెందిన కనిష్క్ కటారియా టాప్ ర్యాంకు సాధించాడు.  గతేడాది సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో మెయిన్స్, ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూల ద్వారా మొత్తం 759 మంది సివిల్స్‌కు ఎంపికయ్యారు.  

More Telugu News