Allu Arjun: నేను మద్దతిస్తున్నాను, నేను ప్రోత్సహిస్తున్నాను: అల్లు అర్జున్ బహిరంగ లేఖ
- నాగబాబు గారికి శుభాభినందనలు
- పవన్ గారు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి
- ట్వీట్ చేసిన బన్నీ
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేస్తున్న మెగా బ్రదర్ నాగబాబుకు తన మద్దతు ప్రకటించారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. ప్రజాసేవను మార్గంగా ఎంచుకున్న నాగబాబు గారికి తన శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో నాగబాబు గారు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.
"రాబోయే ఎన్నికల్లో మీ పక్కన నిలుచుని మేం ప్రచారం చేయలేకపోవచ్చు. కానీ, అన్ని విధాలుగా మేం మీకు అండగా ఉంటాం" అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అంతేగాకుండా, జనసేనాని పవన్ కల్యాణ్ పైనా తన అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన పార్టీతో పాటు పవన్ కల్యాణ్ గారు కూడా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తన ధీరోదాత్తమైన నాయకత్వం, మేధో దార్శనికతతో పవన్ కల్యాణ్ ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నట్టు అల్లు అర్జున్ పేర్కొన్నారు. తామందరం మీ వెంటే ఉన్నామంటూ మెగాబ్రదర్స్ కు మద్దతు ప్రకటించారు.

WE ARE WITH YOU pic.twitter.com/P5FvBv7Ls2q
— Allu Arjun (@alluarjun) April 5, 2019q ">