Pawan Kalyan: ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్.. విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు

  • పవన్ కాళ్లు లాగడంతో గాయం
  • ఐసీయూలో చికిత్స పొందుతున్న పవన్
  • ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో పొందుతున్నారు. నేడు విజయనగరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఓ అభిమాని పవన్ కాళ్లకి నమస్కరించబోయి లాగడంతో ఆయన కిందపడ్డారు. దీంతో పవన్ కాలికి స్వల్ప గాయమైంది.

ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు పవన్‌కు సూచించారు. మరోవైపు పవన్‌ను చూసేందుకు భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలి వస్తుండటంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News