Afridi: బంతిని తీసుకొచ్చే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి మంటల్లో చిక్కుకున్న విద్యార్థి!

  • బంతిని తీసుకొచ్చేందుకు వెళ్లిన చిన్నారి 
  • 11 కేవీ వైర్‌ను గమనించకపోవడంతో ప్రమాదం
  • పరిస్థితి విషమించడంతో యశోదాలో చికిత్స
భవనంపై పడిన బంతిని తీసుకురావడానికి వెళ్లిన చిన్నారికి కరెంట్ షాక్ కొట్టడంతో పరిస్థితి విషమంగా మారిన ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. 7వ తరగతి పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులంతా క్రికెట్ ఆడుతున్నారు. బంతి ఓ భవనంపై పడటంతో దానిని తీసుకు వచ్చేందుకు అఫ్రిది అనే విద్యార్థి వెళ్లాడు.

బంతిని తీసుకుచ్చే హడావుడిలో అక్కడే ఉన్న 11 కేవీ వైర్‌ను గమనించలేదు. దీంతో ఆ వైర్‌ను తాకిన అఫ్రిది మంటల్లో చిక్కుకోగా వెంటనే తోటి విద్యార్థులు వచ్చి రక్షించారు. హుటాముటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Afridi
Ball
11KV wire
MGM
Warangal
Yashoda

More Telugu News