దోచుకున్నది దాచుకోవడానికే 16 మంది ఎంపీల నినాదం: కేసీఆర్‌పై మల్‌రెడ్డి ఫైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దోచుకున్నది దాచుకోవడానికే 16 మంది ఎంపీల నినాదం: కేసీఆర్‌పై మల్‌రెడ్డి ఫైర్

  • డబ్బు పంచి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు 
  • కేసీఆర్ ఏం సాధించారో చెప్పాలి
  • ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయం
సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల 16 మంది ఎంపీలను గెలిపించాలనే నినాదాన్ని చేపట్టింది దోచుకున్నది దాచుకోవడానికేనని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవాలని టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 16 మంది ఎంపీలతో ఈ ఐదేళ్లూ కేసీఆర్ ఏం సాధించారో చెప్పాలని మల్‌రెడ్డి నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
KCR
KTR
Malreddy
TRS
Congress

More Telugu News