Rajahmundry: స్థానికత్వంపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన మాగంటి రూప

  • ఆరోపణలపై చర్చించడానికి సిద్ధం
  • మూడేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నా
  • ఫిల్మ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తా
రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప స్థానికత్వంపై వస్తున్న ఆరోపణలపై తాజాగా ఆమె స్పందించారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను స్థానికురాలిని కాదంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై తాను చర్చించడానికి సిద్ధమన్నారు. మూడేళ్లుగా తాను ఇక్కడే ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని రూప తెలిపారు. ఫిల్మ్ టూరిజాన్ని రాజమండ్రిలో అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. మోరంపూడి ఫ్లై ఓవర్ నిర్మాణం కేంద్ర సహకారం లేకపోవడం వల్లే జరగలేదని రూప పేర్కొన్నారు.
Rajahmundry
Maganti Rupa
Telugudesam
Morampudi Fly Over
Film Tourism

More Telugu News