venkatesh: ఆకట్టుకుంటోన్న 'వెంకీమామ' టైటిల్ లోగో

  • బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ'
  • ఆగస్టునాటికి షూటింగు పూర్తి
  • దసరాకి భారీస్థాయి విడుదల          
బాబీ దర్శకత్వంలో వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా 'వెంకీమామ' రూపొందుతోంది. ఈ ఇద్దరి పాత్రలను బాబీ చాలా వైవిధ్యభరితంగా మలిచాడట. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇటీవలే రాజమండ్రిలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 8వ తేదీ నుంచి ప్లాన్ చేశారు.

'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. టైటిల్ ను అందంగా .. ఆకర్షణీయంగా .. చాలా కొత్తగా డిజైన్ చేశారు. రాశి చక్రంలో 'వెంకీ' అనేది ఆంగ్ల అక్షరాలతో .. 'మామ' అనేది తెలుగు అక్షరాల్లో డిజైన్ చేశారు. పోస్టర్లో ఒక వైపున పల్లెటూరు .. మరో వైపున యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటారు. ఆగస్టు నాటికి ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసి, దసరా పండుగకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. పూర్తి వినోదభరితంగా రూపొందుతోన్న ఈ సినిమా, తెరపై ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి. 
venkatesh
chaitu
payal
rasi khanna

More Telugu News