చెల్లెమ్మలందరికీ నేను అండగా ఉంటా: సీఎం చంద్రబాబు

  • ఆత్మగౌరవం పెంచడానికి ‘డ్వాక్రా’ ఏర్పాటు చేశా
  • రాబోయే ఐదేళ్లలో మూడు సార్లు ‘పసుపు-కుంకుమ’
  • టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి
చెల్లెమ్మలందరికీ నమస్కారం, మహిళల ఆత్మగౌరవం పెంచడానికి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశానని, పొదుపు చేయడం నేర్పించానని, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం, రెండు విడతలుగా పసుపు-కుంకుమ కింద పదివేల రూపాయల చొప్పున ఇచ్చానని అన్నారు. రాబోయే ఐదేళ్లలో మూడు సార్లు పసుపు-కుంకుమ ఇస్తానని వాగ్దానం చేస్తున్నానని అన్నారు. ఒక కోటి మంది చెల్లెమ్మలు ఉన్నారని, వీళ్లందరికి వడ్డీ లేని రుణాలు అందించడం ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్ లో అండగా ఉంటానని, మీరందరూ బాధ్యత తీసుకుని టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాటుపడాలని కోరుతున్నానని అన్నారు. 
Go Back to Shorts
dwacra
Telugudesam
Chandrababu
cm
pasupu kumkum

More Telugu News