advani: 'మొదట దేశం.. ఆ తర్వాతే పార్టీ' అన్న అద్వానీ వ్యాఖ్యలపై మెహబూబా ముఫ్తీ స్పందన

  • మోదీ ప్రధాని అయిన తర్వాత అద్వానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు
  • బీజేపీ అధికారానికి దూరమవుతున్న తరుణంలో మాట్లాడారు
  • విపక్ష నేతలను దేశద్రోహులుగా బీజేపీ ముద్ర వేస్తోంది

'మొదట దేశం.. తర్వాత పార్టీ... ఆ తర్వాతే వ్యక్తిగతం' అంటూ తన బ్లాగ్ లో బీజేపీ కురువృద్ధుడు అద్వానీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ తన ప్రత్యర్థులుగా చూసిందే తప్ప.. శత్రువులుగానో, దేశద్రోహులుగానో చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు.

ఈ ఐదేళ్ల కాలంలో అద్వానీ మాట్లాడి ఉంటే ఎంతో బాగుండేదని ముఫ్తీ అన్నారు.  బీజేపీ మూలపురుషుడైన అద్వానీ తన పార్టీ ప్రస్తుత వైఖరిని ప్రశ్నిస్తుండటం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని తెలిపారు. మోదీ ప్రధాని అయిన తర్వాత అద్వానీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదని అన్నారు. దేశభక్తి పేరుతో విపక్ష నేతలందరినీ దేశ వ్యతిరేకులుగా ముద్ర వేసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. 2014 నుంచి ఒక్క మాట కూడా మాట్లాడని అద్వానీ... కేంద్రంలో బీజేపీ అధికారం ముగియబోతున్న చివరి క్షణాల్లో మాట్లాడారని అన్నారు.

More Telugu News