amit shah: జనం లేక వెలవెలబోయిన అమిత్ షా సభ!

  • నరసరావుపేటలో అమిత్ షా బహిరంగ సభ
  • జనాలు లేక కుర్చీలు ఖాళీ 
  • కంగుతిన్న పార్టీ శ్రేణులు

ఏపీలో బీజేపీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎంతగా అంటే పార్టీ అగ్రనేతల సభలకు కూడా జనాలు హాజరుకాలేనంత. మొన్న కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిర్శహించిన సభ జనాలు లేక వెలవెలపోయింది. నిన్న గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన సభకు జనాలు కరవయ్యారు. జనం లేక సభ వెలవెలబోయింది. సగానికి సైగా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడి సభ ఫ్లాప్ కావడంతో ఆ పార్టీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి.

  • Loading...

More Telugu News