Telugudesam: ఏపీలో బీజేపీ రెండు సీట్లనూ టీడీపీ, వైసీపీ పంచుకుంటాయి... మిగతాది సేమ్ టూ సేమ్: న్యూస్ ఎక్స్ పోల్ సర్వే!

  • టీడీపీకి 16, వైసీపీకి 9
  • విశాఖ, నరసాపురం సీట్లను చెరోటీ గెలుస్తాయి
  • ఇతర పార్టీలకు స్థానం లేదన్న సర్వే

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నం, నరసాపురం లోక్ సభ సీట్లను టీడీపీ, వైసీపీలు చెరొకటి గెలుచుకుంటాయని న్యూస్ ఎక్స్, ఫేస్ బుక్, యూ-ట్యూబ్ పోల్ సర్వే వెల్లడించింది. మొత్తం 25 స్థానాల్లో టీడీపీకి 16, వైసీపీకి 9 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. టీడీపీకి 43 శాతం ఓట్లు వైసీపీకి 37 శాతం ఓట్లు రావచ్చని, బీజేపీ 7 శాతానికి, కాంగ్రెస్ 6 శాతానికి, ఇతరులు 7 శాతం ఓట్లకు పరిమితం కావచ్చని తెలిపింది. టీడీపీ, వైసీపీ మినహా మరే ఇతర పార్టీకి లోక్ సభ స్థానాలు గెలిచే సత్తా లేదని అంచనా వేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇరు పార్టీలూ చెరో సీటును గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండా చేస్తాయని వెల్లడించింది.

ఇక అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే, టీడీపీకి 92, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 77, కాంగ్రెస్ కు 4, బీజేపీకి 1, ఇతరులకు ఒక సీటు రావచ్చని, ఈ దఫా ఎన్నికలు పోటా పోటీగా జరగనున్నాయని పేర్కొంది.ఫేస్ బుక్, యూ-ట్యూబ్ లతో కలిసి ఈ సర్వేను నిర్వహించినట్టు న్యూస్ ఎక్స్ తెలిపింది.

More Telugu News