Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఓటుకు నోటు కేసు తిరగదోడండి... జగన్ కు మాత్రం సాయం వద్దు: కేసీఆర్ కు పవన్ సలహా!

  • హైదరాబాద్ లోని ఇంటిని సీజ్ చేసుకోండి
  • బాబుపై కోపంతో జగన్ కు మాత్రం మద్దతు ఇవ్వొద్దు
  • ఏపీ వేరని గుర్తుంచుకోవాలని సూచన
"మీరు చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని అనుకుంటే, హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంటిని సీజ్‌ చేసుకోవచ్చు. ఓటుకు నోటు కేసును తిరగతోడవచ్చు. అంతే తప్ప అవి పక్కనబెట్టి చంద్రబాబు మీద కోపంతో జగన్‌ కు మద్దతు ఇస్తే మాత్రం నేను మొన్నటి తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో పోరాడుతాను. ఆంధ్ర ప్రజలు వేరు, పాలకులు వేరని గుర్తుంచుకోండి" అని బీఎస్పీ - జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సలహా ఇచ్చారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు, పదిమంది కూడా వెనుక లేకుండా తెలంగాణ ఉద్యమం ఏం చేస్తారంటూ ప్రశ్నించిన విషయాన్ని మరిచారా? అని ప్రశ్నించిన పవన్.. మానుకోట రైల్వే స్టేషన్ లో జగన్ చేసిన దౌర్జన్యాలు మరిచారా? అంటూ అడిగారు. తిరుమలకు చెప్పులతో వచ్చిన జగన్ వంటి వ్యక్తిని వెనకేసుకుని వచ్చి, ఏపీ ప్రజలకు నష్టం కలిగించవద్దని ఆయన కోరారు. 
Pawan Kalyan
Hyderabad
Jagan
KCR

More Telugu News