Telangana: భవిష్యత్తులో టీఆర్ఎస్ నేతలు కీలక పదవులు పొందుతారు: సీఎం కేసీఆర్

  • టీఆర్ఎస్ నేతలు గవర్నర్లు, విదేశీ రాయబారులు అయ్యే రోజులొస్తాయి
  • దేశ భవిష్యత్ ను నిర్ణయించడంలో ఈ ఎన్నికలు కీలకం
  • ఎన్నికల తర్వాత నర్సరీ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం

భవిష్యత్ లో టీఆర్ఎస్ నేతలు కీలక పదవులు పొందుతారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతలు గవర్నర్లు, విదేశీ రాయబారులు అయ్యే రోజులు వస్తాయన్న నమ్మకం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్ ను నిర్ణయించడంలో ఈ ఎన్నికలు చాలా కీలకమని, కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి ప్రభుత్వం వస్తేనే దేశం బాగుపడుతుందని అన్నారు.

ఈ ఎన్నికల తర్వాత నర్సరీ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని, సుబాబుల్ రైతుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా కష్టాలు తీరతాయని, ఈ ప్రాజెక్టులతో రెండు పంటలకు నీరు అందుతుందని చెప్పారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను కచ్చితంగా సాధించుకుని తీరతామని అన్నారు.

  • Loading...

More Telugu News